- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాపూర్‌లో భార్యను చంపిన భర్త.. నాన్నకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ పోలీస్ స్టేషన్‌కు చిన్నారి.. మర్డర్ ప్లాన్ కూడా..
ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో భార్యను కాల్చి చంపాడు భర్త. షాపూర్ ప్రాంతంలోని ఓ దుకాణం నుంచి బయటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ కేసులో నాన్నకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని,

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో భార్యను కాల్చి చంపాడు భర్త. షాపూర్ ప్రాంతంలోని ఓ దుకాణం నుంచి బయటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ కేసులో నాన్నకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, అమ్మ వ్యతిరేకిస్తే చంపాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది పదమూడేళ్ల చిన్నారి.
జైల్ రోడ్‌కు చెందిన విశ్వకర్మ చౌహాన్, మమతా చౌహాన్‌కు పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి పదమూడేళ్ల కూతురు. ముందు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నా తర్వాత ఒకరిపై మరొకరు ఇల్లీగల్ ఎఫైర్ ఆరోపణలు పెట్టుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం మమత కూతురును తీసుకుని బయటకు వెళ్లిపోయింది. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ బిడ్డను పోషించుకుంటుంది. షాపూర్‌లో అద్దెకు ఉంటూ బతుకుంది. ప్రస్తుతం కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది.
అయితే మమత బయటకు వెళ్లిపోవడంతో ఓ అమ్మాయితో ఆరు నెలల క్రితం డేటింగ్‌కు వెళ్లాడు విశ్వ. దీన్ని చూసిన మమత.. ఓ వ్యక్తితో కలిసి భర్తపై ఎటాక్ చేసింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన.. ఆ వ్యక్తితో భార్యకు ఎఫైర్ ఉందని నమ్మాడు. ఉన్న ఆస్తులు అమ్మి పిస్టల్ కొని.. చంపేందుకు ప్లాన్ చేశాడు. కూతురు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






