భర్తను చంపిన భార్య.. ఇంట్లో పడి చనిపోయాడని నమ్మించే యత్నం..

by Bhanu |

కుటుంబ కలహాలతో జరిగిన గొడవలో భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. భర్తను భార్యనే చంపినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

భర్తను చంపిన భార్య.. ఇంట్లో పడి చనిపోయాడని నమ్మించే యత్నం..
X

దిశ, వనస్థలిపురం : కుటుంబ కలహాలతో జరిగిన గొడవలో భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. భర్తను భార్యనే చంపినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సభవత్ తండాకు చెందిన కిషన్ నాయక్ (40), యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన చెందిన శిరీష(28)ను 8 ఏండ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు.

జీవనోపాధి కోసం వనస్థలిపురంలోని హిల్స్ కాలనీలో నివాసముంటున్నారు. కాగా, కుటుంబ కలహాలతో నేపథ్యంలో శిరీష, కిషన్ నాయక్ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, శిరీష భర్త కిషన్ నాయక్ ను ఇంటికి పిలిపించింది. సోమవారం రాత్రి ఇంట్లో మళ్లీ గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తను నెట్టివేస్తే కింద పడడంతో శిరీష తన చున్నితో కిషన్ నాయక్ గొంతు నులిమి హత్య చేసింది.

సమాచారం తెలుసుకున్న కిషన్ నాయక్ కుటుంబ సభ్యులు హిల్స్ కాలనీకి చేరుకున్నారు. పథకం ప్రకారమే కిషన్ నాయక్ ను ఇంటికి పిలిచిన శిరీష చున్నీతో ఉరివేసి హత్య చేసినట్లు ఆరోపించారు. కిషన్ నాయక్ కుమార్తె బిందు (19) ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో శిరీషతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కిషన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.

Next Story