- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి అయిన ఏడో రోజే.. భర్తను కాటికి పంపిన భార్య..
ఎంత సంతోషంగా పెళ్లి చేసుకున్నాడో.. ఎంత ఘనంగా వివాహం జరిగిందో.. భార్యపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో.. కానీ భార్య మాత్రం పెళ్లి జరిగిన ఏడో రోజే కాటికి పంపించింది. ఇది ఒక భర్త స్టోరీ. కాగా ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది.

దిశ, వెబ్ డెస్క్ : ఎంత సంతోషంగా పెళ్లి చేసుకున్నాడో.. ఎంత ఘనంగా వివాహం జరిగిందో.. భార్యపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో.. కానీ భార్య మాత్రం పెళ్లి జరిగిన ఏడో రోజే కాటికి పంపించింది. ఇది ఒక భర్త స్టోరీ. కాగా ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఇందుకు ఓ మైనర్ సాయం కూడా తీసుకుంది. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలోని బేడిపూర్ విలేజ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రుక్సానా, అనీస్‌కు వైభవంగా పెళ్లి జరిగింది. కానీ రుక్సానా అప్పటకే రింకూతో ప్రేమలో ఉంది. దీంతో అనీస్‌తో పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ పేరెట్స్ ఒత్తిడితో వివాహం చేసుకుంది.
అయితే పెళ్లి జరిగిన ఏడో రోజే లవర్‌కు భర్తను చంపేయాలని సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే అనీస్‌ను తాము ఓ చోటుకు వెళ్లాలని.. ఎలా వెళ్లాలో చెప్పాలని డైరెక్షన్స్ కోసం ఆపారు. మాట్లాడుతుంటుటేనే పిస్టల్‌తో కాల్చి చంపారు. ఇది రెండు మతాలకు సంబంధించిన విషయం కావడంతో గ్రామంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.






