- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీళ్ల కుళాయి దగ్గరకు వెళ్లిన భార్య.. వెనకాలే సైలెంట్‌గా వెళ్లిన భర్త.. ఎంత దారుణం?
కారణం ఏంటో తెలియదు కానీ.. అత్తగారి ఇంట్లోనే ఉంటూ భార్యను అతి దారుణంగా హత్య చేశాడో భర్త.

దిశ, గుడిహత్నూర్: కారణం ఏంటో తెలియదు కానీ.. అత్తగారి ఇంట్లోనే ఉంటూ భార్యను అతి దారుణంగా హత్య చేశాడో భర్త. తాగునీటి కోసం వీధిలోకి వచ్చిన భార్యపై నడిబజారులోనే కత్తితో కిరాతంగా దాడి చేసి పరారీ అయ్యాడు. ఇవాళ ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన కీర్తికి కొన్నాళ్ల క్రితం లట్పటే మారుతితో వివాహం అయింది. కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగానే సాగినా ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో కీర్తి తన పుట్టింటికి వచ్చి ఉంటుంది. నాలుగు రోజులు క్రితం ఈ విషయంపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. అప్పటి నుంచి కీర్తి భర్త మారుతి సైతం గుడిహత్నూర్‌లోని అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ రోజు ఉదయం అత్తమామ పనికి వెళ్లిన సమయంలో భార్యభర్తలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. వీధిలో పబ్లిక్ కుళాయిలో నీళ్లు వస్తుండటంతో తాగునీరు తెస్తానని భార్య బిందె తీసుకుని వీధిలోకి వెళ్లింది. ఉన్నట్టుండి మారుతి సైలెంట్‌గా భార్య వెనకాలే కత్తి తీసుకోని వెళ్లి పబ్లిక్ కుళాయి వద్దే ఆమె మెడపై దారుణంగా దాడి చేసి పరారీ అయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు తీవ్రంగా గాయపడిన కీర్తిని 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. కానీ అప్పటికే కీర్తి మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. ఇచ్చోడ సీఐ భీమేష్, ఎస్సై మహేందర్ హత్య జరిగిన స్థలానికి చేరుకొని పరిశీలించారు. హతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారి తీసిన వివరాలు తెలియాల్సి ఉంది.






