యూజ్ అండ్ త్రో ఆంటీ! అతడితో కోరికలు తీర్చుకున్న భర్త, భార్య!! ఆపై ఇద్దరు కలిసి..

by Bhoopathi Nagaiah |

యూజ్ అండ్ త్రో ఆంటీ! అతడితో కోరికలు తీర్చుకున్న భర్త, భార్య!! ఆపై ఇద్దరు కలిసి..
X

దిశ, వెబ్‌డెస్క్ : నేటి రోజుల్లో మంచి, మానవత్వం అనేదే లేకుండా పోతుంది. అవసరానికి ఆదుకున్నారనే కృతజ్ఞత లేకుండా కొందరు ప్రవర్తిస్తుంటే.. ఆపదలో ఆదుకున్నా అంటూ అడ్వాంటేజ్ తీసుకునే వాళ్లు మరి కొందరు ఉన్నారు. ఈ క్రమంలో అక్రమ సంబంధాలు, పగలు, హత్యలు అంటూ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి నయవంచన ఘటనే జరిగింది. భర్తకు అప్పు ఇచ్చి ఆదుకున్న వ్యక్తే ఆ ఇంటి ఇల్లాలితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో హత్యకు గురయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ జంపయ్య, విజయ దంపతులు. వీళ్లు ఐదేళ్ల క్రితం గ్రామంలో భూమిని కొన్నారు. ఆ సమయంలో వారికి బానోత్ కొమ్మాలు (40) అనే వ్యక్తి వారికి లక్షన్నర రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఈ సాకుతో కొమ్మాలు తరచూ జంపయ్య ఇంటికి రాసాగాడు. ఈ క్రమంలో విజయతో సాన్నిహిత్యం పెరిగి వివాహేత సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లుగా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇటీవల భర్త జంపయ్యకు తెలియడంతో భార్యతో గొడవకు దిగాడు. ఆపై నమ్మక ద్రోహం చేశాడని కొమ్మాలును పంచాయితీలో పెట్టాడు. పెద్దమనుషులు కొమ్మాలుకు రూ.70 వేల జరిమానా వేసి మళ్లీ విజయ జోలీకి వెళ్లవద్దని హెచ్చరించి పంపించారు.

అయితే భార్య వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేని జంపయ్య ఆమెతో గొడవకు దిగాడు. నిన్ను లేదా కొమ్మాలును చంపేస్తానని భార్యను హెచ్చరించారు. అయితే.. ‘నన్ను ఎందుకు చంపడం..? మనిద్దరం కలిసి కొమ్మాలును చంపేద్దాం.. మనం హ్యాపీగా ఉందాం..’ అంటూ భర్తకు ఆఫర్ ఇచ్చింది. అప్పటికే కొమ్మాలుపై కోపంతో ఉన్న భర్త.. భార్య డీల్‌కు ఓకే అన్నాడు. ప్లాన్ ప్రకారం కొమ్మాలును ఊరి చివరన ఉన్న మొన్నజొన్న చేనుకు రప్పించింది విజయ. ఆ తర్వాత అతడిని నడి చేనులోకి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడే మాటువేసి ఉన్న జంపయ్య ఒక్కసారిగా కొమ్మాలుపై కత్తితో దాడి చేశాడు. భార్యభర్తలు కలిసి అతడిని పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత ఏం తెలియనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు జంపయ్య, విజయలపై అనుమానంతో గాలింపు చేపట్టారు. ఇవాళ రుద్రగూడెంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దంపతులు పట్టుబడ్డారు. ఈ కేసుపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Next Story