ఏపీలో మరో దారుణం.. ప్రియురాలి కోసం భార్యను హత్య చేసిన భర్త!

by Ajay Maddhiboyina |

ఏపీలో ఇటీవ‌ల ప్రియుడి మోజులో భ‌ర్త‌ను హ‌త‌మార్చిన చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు ప్రేయ‌సి మోజులో ఓ భ‌ర్త క‌ట్టుకున్న భార్య‌ను హ‌త్య చేశాడు.

ఏపీలో మరో దారుణం.. ప్రియురాలి కోసం భార్యను హత్య చేసిన భర్త!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో ఇటీవ‌ల ప్రియుడి మోజులో భ‌ర్త‌ను హ‌త‌మార్చిన చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు ప్రేయ‌సి మోజులో ఓ భ‌ర్త క‌ట్టుకున్న భార్య‌ను హ‌త్య చేశాడు. అంతే కాకుండా ఈ దారుణానిని అత‌డి అమ్మ‌మ్మ‌, త‌ల్లి, సోద‌రి స‌హ‌క‌రించిన‌ట్టు పోలీసుల ద‌ర్యాప్తులో చేరింది. వివ‌రాల్లోకి వెళితే చిత్తూరు త‌వ‌ర‌ణం ప‌ల్లె మండలం మంగ‌ప‌ల్లెకు చెందిన దంప‌తులు విజ‌య్ శేఖ‌ర్ రెడ్డి, ఇందుజ‌. వీరికి ఇద్ద‌రు సంతానం కూడా ఉన్నారు. కొన్నేళ్లుగా వీరి కాపురం స‌జావుగా సాగుతుండ‌గా విజ‌య్ శేఖ‌ర్ రెడ్డికి మ‌రో యువ‌తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

అది కాస్తా వివాహేత‌ర సంబందానికి దారి తీసింది. దీంతో క‌టుంబ‌లో క‌ల‌హాలు మొద‌ల‌య్యాయి. విజ‌య్ శేఖ‌ర్ రెడ్డి ఎలాగైనా త‌న భార్య‌ను అడ్డుతొల‌గించుకోవాల‌ని భావించాడు. దానికి అత‌డి కుటుంబ సభ్యులు సోద‌రి, అమ్మమ్మ‌, భార్య కూడా స‌హ‌క‌రించారు. వీరంతా కలిసి ఇందుజ‌ను ప‌థ‌కం ప్రకారం గొంతునులిమి హ‌త్య చేశారు. అనంత‌రం ఆమె బావిలో ప‌డి చ‌నిపోయింద‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. ఘ‌ట‌న‌పై ఇంద్ర‌జ త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా కేసు న‌మోదు చేసుకుని త‌మ స్టైల్ లో ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఇంద్ర‌జ‌ను భ‌ర్త‌నే హ‌త్య చేశాడ‌ని, అత‌డికి కుటుంబ స‌భ్యులు సాయం చేశార‌ని గుర్తించారు. దీంతో పోలీసులు న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

Next Story