- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లరి చేసిన కూతురు.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
పిల్లలపై తల్లిదండ్రులు ప్రేమ ఉండటం సహజం. కానీ ఓ తండ్రికి కూతురుపై ఉన్న ప్రేమే కట్టుకున్న భార్యను హత్య చేసేలా చేసింది.

దిశ, వెబ్‌డెస్క్ : పిల్లలపై తల్లిదండ్రులు ప్రేమ ఉండటం సహజం. కానీ ఓ తండ్రికి కూతురుపై ఉన్న ప్రేమే కట్టుకున్న భార్యను హత్య చేసేలా చేసింది. అల్లరి చేస్తున్న చిన్నారి చెంపపై ఓ దెబ్బ వేసిందన్న కారణంతో భార్య గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు భర్త. ఆపై తాను ఆత్మహత్యాయత్నం చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన మంగళవారం గురుగ్రామ్‌లో వెలుగు చూసింది.
గురుగ్రామ్‌లోని రాజేంద్ర పార్క్‌లో నివసిస్తున్న కేతన్ పాఠక్ (30) నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో విభాగంలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య జ్యోతి (27) మూడేళ్ల చిన్నారి ఉంది. అయితే కూతురు అల్లరి చేస్తుండటంతో భార్య జ్యోతి.. చిన్నారి చెంపపై ఓ దెబ్బ వేసింది. దీంతో అక్కడే ఉన్న పాఠక్.. ఎందుకు అలా కొడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో భార్యభర్తల మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన కేతన్ పాఠక్.. జ్యోతి మెడకు ఆమె ధరించిన చుడీదార్‌నే బిగించి ఆపై కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. దీంతో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘర్షణ సమయంలో పాఠక్ తల్లిదండ్రులు, వదిన సైతం కింది పోర్షన్‌లో ఉన్నారు. భార్యభర్తలు గొడవ పడుతున్న శబ్ధాలు విన్నా.. ఇద్దరి మధ్య చిన్న తగాదా అనుకుని పైకి ఎవరూ వెళ్లలేదు.
హత్య అనంతరం పాఠక్ ఆత్మహత్యాయత్నం చేశాడు. కానీ మళ్లీ మనసు మార్చుకోని ఆనంద్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన కూతురిని కొట్టడంతోనే భార్యను హత్య చేసినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. కేసు నమోదు చేసిన స్టేషన్ ఆఫీసర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. జ్యోతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుందన్నారు. కూతురిని కొట్టిందన్న కోపంలో పాఠక్ ముందుగా భార్యపై దాడి చేశాడని, ఆ తర్వాతే ఆమెను హత్య చేసినట్టు తెలిపారు. హత్యకు క్షణికావేశమేనా.., ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. హతురాలి తరుఫు నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కేతన్ పాఠక్ వాంగ్మూలంతోనే కేసు నమోదు చేశామని స్టేషన్ ఆఫీసర్ సందీప్ కుమార్ తెలిపారు. కేతన్ పాఠక్ తన భార్యను హత్య చేసినట్టు మాత్రమే చెప్పాడని, మిగతా ఏ విషయాలు అడిగినా నోరు విప్పడం లేదని చెప్పారు.






