జర్మనీలో నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం

by Ajay Maddhiboyina |

జ‌ర్మ‌నీలో న‌ర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసానికి పాల్ప‌డ్డారు. హైద‌రాబాద్ మూసారంబాగ్ లోని వీసా విజ‌న్ క‌న్స‌ల్టెన్సీ నిర్వాహ‌కులు శిక్ష‌ణ ఇచ్చి విదేశాల‌కు పంపిస్తామ‌ని చెప్పి త‌మ వ‌ద్ద ల‌క్ష‌లు దోచుకున్నార‌ని బాధితులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

జర్మనీలో నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం
X

దిశ‌, వెబ్ డెస్క్: జ‌ర్మ‌నీలో న‌ర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసానికి పాల్ప‌డ్డారు. హైద‌రాబాద్ మూసారంబాగ్ లోని వీసా విజ‌న్ క‌న్స‌ల్టెన్సీ నిర్వాహ‌కులు శిక్ష‌ణ ఇచ్చి విదేశాల‌కు పంపిస్తామ‌ని చెప్పి త‌మ వ‌ద్ద ల‌క్ష‌లు దోచుకున్నార‌ని బాధితులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. క‌న్స‌ల్టెన్సీ కార్యాల‌యం ముందు ఆందోళ‌న చేపట్టిన బాధితులు జర్మన్ భాష శిక్షణ, వీసా, వసతి, ఉద్యోగం కల్పిస్తామని చెప్పి మోసం చేసినట్లు వెల్ల‌డించారు.

నెలలు గడిచినా కన్సల్టెన్సీ డైరెక్టర్ డాక్టర్ రఘువీర రెడ్డి, సీత స్పందించలేదని చెబుతున్నారు. ఇదివ‌ర‌కు క‌న్స‌ల్టెన్సీలో ఒక బ్యాచ్ ఉంద‌ని ఆ బ్యాచ్ వాళ్లు త‌మ‌కు ఫోన్ చేసి ఇదంతా చీటింగ్ అని చెప్పార‌ని అన్నారు. దాదాపు కోటి రూపాయలకు పైగా వసూలు చేశార‌ని బాధితులు చెబుతున్నారు. తాము అంతా స్టాఫ్ న‌ర్స్ స్టూడెంట్స్ అని మొత్తం 15మంది ఉన్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే పోలీసుల‌కు ఫిర్యాదు చేసి 15 రోజులు అవుతుంద‌ని కానీ ప‌ట్టించుకోవ‌డంలేద‌న్నారు. చెల్లించిన ఫీజులు వెంట‌నే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story