- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఒకేరోజు రెండు చోట్ల భారీగా లభ్యం
నగరంలో మాదకద్రవ్యాల రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), కస్టమ్స్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో మాదకద్రవ్యాల రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), కస్టమ్స్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో డీఆర్ఐ అధికారులు జరిపిన మెరుపు తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.11.4 కోట్ల విలువైన 11.4 కిలోల 'క్రిస్టల్ మెత్' (Crystal Meth) రకానికి చెందిన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ బ్యాగుల్లో చాకచక్యంగా ఈ డ్రగ్స్‌ను తరలిస్తున్న ఇద్దరు మహిళలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసిన డీఆర్ఐ అధికారులు, ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారుల కోసం ఆరా తీస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గంజాయి..
మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని తనిఖీ చేశారు. ప్రయాణికుడి వద్ద ఉన్న 16 సీల్డ్ ప్యాకెట్లలో సుమారు 6.15 కిలోల 'హైడ్రోఫోనిక్ గంజాయి' లభ్యమైంది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 2.15 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నగరంలోకి భారీగా డ్రగ్స్ చేరుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు మరియు విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.






