కాళేశ్వరం ఈఈ శ్రీధర్ బ్యాంక్ అకౌంట్‌లో భారీగా నగదు.. లాకర్ ఓపెన్ చేసి ఖంగుతిన్న అధికారులు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-23 11:28:59  IST  )

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన నీటిపారుదలశాఖ ఈఈ నూనె శ్రీధర్‌(EE Sridhar)ను ఏసీబీ(ACB) అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే.

కాళేశ్వరం ఈఈ శ్రీధర్ బ్యాంక్ అకౌంట్‌లో భారీగా నగదు.. లాకర్ ఓపెన్ చేసి ఖంగుతిన్న అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన నీటిపారుదలశాఖ ఈఈ నూనె శ్రీధర్‌(EE Sridhar)ను ఏసీబీ(ACB) అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం(నాలుగోరోజు) నాటి విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీధర్ బ్యాంక్ లాకర్లలో భారీగా నగదును గుర్తించారు. దాదాపు రూ.5 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా.. నూనె శ్రీధర్‌ ఏడాది క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బదిలీ అయినప్పటికీ, అక్కడే తన విధులు కొనసాగిస్తున్నట్టు ఏసీబీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. బదిలీ అయినప్పటికీ శ్రీధర్‌ కాళేశ్వరంలోనే ఎందుకు పనిచేస్తున్నారనేదానిపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అధికారుల నివేదిక ఆధారంగానే ఈ అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్లు సమాచారం.

Next Story