గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ హోంగార్డు.. రిమాండ్‌కు తరలింపు

by Chintha Aamani |

గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ సంగారెడ్డి పట్టణానికి చెందిన హోంగార్డు రాజుని పోలీసులు రిమాండ్ కు తరలించారు.

గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ హోంగార్డు.. రిమాండ్‌కు తరలింపు
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ సంగారెడ్డి పట్టణానికి చెందిన హోంగార్డు రాజుని పోలీసులు రిమాండ్ కు తరలించారు. జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు అయిన రాజు, ఇదే పట్టణానికి చెందిన కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామ పరిధిలోని ఓ బీర్ పరిశ్రమలో పనిచేస్తున్న విజయ్ తో కలిసి ఈ దందాను నడిపిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. పరారీలో ఉన్న మరో నిందితుడైన విజయ్ ను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం ద్వారా గాలిస్తున్నట్లు సంగారెడ్డి రూరల్ సీఐ క్రాంతి కుమార్ దిశ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. అయితే విజయ్ చెబితేనే ఈ పని చేసినట్లు హోంగార్డు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కాగా ఈ కేసులో హోంగార్డు వద్ద నుంచి 800 గ్రాములు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటుంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Next Story