- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్.. ఏకంగా 8 మంది దుర్మరణం
ఇండోనేషియాలోని వెస్ట్ కాళీమంతన్ ప్రాంతంలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్‌డెస్క్: హెలికాప్టర్ కుప్పకూలి ఎనిమిది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఇండోనేషియా (Indonesia)లోని వెస్ట్ కాళీమంతన్ (West Kalimantan) ప్రావిన్స్‌లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. మెలావి (Melawi) జిల్లాలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ అయింది. వెస్ట్ కాళీమంతన్ ప్రాంతంలోని మెలావి జిల్లాలో హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. హెలికాప్టర్ కూలిన సమయంలో అందులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించినట్లుగా అధికారులు ధృవీకరించారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ కూలిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా..? లేక సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో ఇండోనేషియా విమానయాన శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోందని సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషాదకర వార్తతో ఇండోనేషియాలో విషాద ఛాయలు అలముకున్నాయి.






