- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగురాలిపై వేధింపులు.. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య
వేధింపులు భరించలేక ఓ దివ్యాంగురాలు తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.

దిశ, మీర్ పేట్ : వేధింపులు భరించలేక ఓ దివ్యాంగురాలు తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తన్నేరు ఏడుకొండలు 12 ఏళ్ల క్రితం నగరానికి బతుకు దెరువు కోసం వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత అల్మాస్ గూడ లో నివాసం ఉంటున్నారు.అతనికి ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు దివ్యాంగులు ( చెవిటి,మూగ వారు) పెద్ద కుమార్తె శ్రీలక్ష్మి ( 21) కి ఇంటి ఎదురుగా పరిచయమున్న శిరీష మరిది శ్రీకాంత్ పరిచయం ఏర్పడడంతో తరచూ ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడేవాడు.
అదే అదునుగా భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీ లక్ష్మీ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో కి వచ్చిన ఆమె చెల్లెలు శ్రీకాంత్ బాత్రూం లో దాక్కున్నాడని ఈ విషయం ఎవరికైనా చెబితే మీ కుటుంబ సభ్యుల ను చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడని బంధువులు పేర్కొన్నారు. గత 20 రోజుల క్రితం కూడా శ్రీకాంత్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ సమయంలో ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేసి పారిపోయాడు. తనపై అత్యాచారానికి పాల్పడ్డ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలని చెల్లెలు కోరడంతో తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు.మీర్ పేట్ పోలీసులు శ్రీకాంత్ పై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం సొంత గ్రామానికి తరలించారు.






