తెల్లవారితే పెళ్లి... అంతలోనే వరుడు ఆత్మహత్య.. ఇంతకీ ఏమైనట్టు..?

by Gantepaka Srikanth |

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని రాంచద్రంపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది.

తెల్లవారితే పెళ్లి... అంతలోనే వరుడు ఆత్మహత్య.. ఇంతకీ ఏమైనట్టు..?
X

దిశ, మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని రాంచద్రంపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. రాంచద్రంపేట గ్రామానికి చెందిన లక్కంపెళ్లి కిరణ్ (37) అనే యువకుడు శనివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాలపడ్డాడు. రేపు ఆదివారం ఉదయం అతని వివాహం ఉండగా.. శుక్రవారం ప్రీవెడ్డింగ్ షూట్ సహా ఇతరత్రా కార్యక్రమాలు పూర్తిచేసుకొని శుక్రవారం సాయంత్రం ఇంటికొచ్చి తినేసి పడుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అనూహ్యంగా అతను ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న మెట్ పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించించారు. వరుడి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story