- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలకలం.. హాస్టల్ భవనం నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..
by Bhanu |
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేటలోని గురుకుల పాఠశాల వసతి గృహంలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది.

X
దిశ, చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేటలోని గురుకుల పాఠశాల వసతి గృహంలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సంధ్య అనే ఐదో తరగతి విద్యార్థిని సోమవారం ఉదయం హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సంధ్య తూప్రాన్ పేటలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చదువుతుండగా, అక్కడే వసతి గృహంలో ఉంటోంది. ఇటీవల హోం సిక్ హాలిడేస్ నేపథ్యంలో తల్లిదండ్రులు వచ్చి ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆదివారం మళ్లీ హాస్టల్‌కు తీసుకురావడంతో.. తెల్లవారుజామున ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.
ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన గురుకుల పాఠశాల వాతావరణాన్ని విషాదంలో ముంచెత్తింది. అధికారులు, స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Next Story






