Ganja Seize: శామీర్‌పేట్‌లో ఎస్‌వోటీ పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి సీజ్

by Kema Shiva Kumar |

నగరంలోనే కాకుండా పల్లెల్లో కూడా గంజాయి కల్చర్ జోరుగా కొనసాగుతోంది.

Ganja Seize: శామీర్‌పేట్‌లో ఎస్‌వోటీ పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్/శామీర్‌పేట్: నగరంలోనే కాకుండా పల్లెల్లో కూడా గంజాయి కల్చర్ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ (Telangana)ను డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు సర్కార్ పక్కా ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు డ్రగ్స్, గంజాయి విక్రయిస్తూ.. ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ జిల్లా (Medchal District)లోని శామీర్‌పేట్ (Shamirpet) ఔటర్ రింగ్‌రోడ్డు (Outer Ring Road) పరిధిలో ఇవాళ సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు (Cyberabad SOT Police) తనిఖీ చేపట్టారు. ఒడిశా (Odisha) నుంచి హైదారాబాద్‌ (Hyderabad)కు వస్తున్న ఓ బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో దాదాపు 275 కిలోల గంజాయి లభ్యమైంది. ఈ మేరకు కారులో ఉన్న హర్యానాకు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా ఎస్‌వోటీ పోలీసులు వెల్లడించారు.

Next Story