ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో మోసం.. జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అరెస్టు

by Kema Shiva Kumar |

రియల్ ఎస్టేట్ రంగంలో ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో వేలాది మంది కొనుగోలుదారులను మోసం చేసిన జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Jayatri Infrastructures India Private Limited) కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది

ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో మోసం.. జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: రియల్ ఎస్టేట్ రంగంలో ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో వేలాది మంది కొనుగోలుదారులను మోసం చేసిన జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Jayatri Infrastructures India Private Limited) కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్‌ (Kakarla Srinivas)ను చెన్నై (Chennai)లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

కాగా, బాధితుల ఫిర్యాదుల మేరకు తెలంగాణ పోలీసులు ఇప్పటికే కాకర్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేసినప్పటికీ, బెయిల్‌పై విడుదలైన అనంతరం అతను పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ, ఇటీవల చెన్నైలో అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తున్నది. కంపెనీ ప్రీ-లాంచ్ ఆఫర్లు, భవిష్యత్ ప్రాజెక్టుల పేరుతో జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వందలాది మంది నుంచి సుమారు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇళ్లు, ఫ్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి, నిధులు సేకరించినా ప్రాజెక్టులు పూర్తి కాకుండా, రిఫండ్లు కూడా ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈడీ ఇప్పటికే హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, ముఖ్యమైన డాక్యుమెంట్లు, డిజిటల్ డివైస్‌లు స్వాధీనం చేసుకుంది. బాధితుల నుంచి సేకరించిన నిధులను షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

Next Story