‘క్రిప్టో’ కరెన్సీలో పెట్టుబడులతో లాభాలంటూ ఘరానా మోసం

by Disha Web Desk 4 |
‘క్రిప్టో’ కరెన్సీలో పెట్టుబడులతో లాభాలంటూ ఘరానా మోసం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే దండిగా లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యాపారిని కోట్ల రూపాయలకు ముంచారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంటున్న ఓ బడా వ్యాపారి మొబైల్‌కు కొన్ని రోజుల క్రితం మెసేజ్ వచ్చింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే ఒకటికి మూడింతల లాభం వస్తుందని అందులో పేర్కొంటూ ఓ లింక్ ఇచ్చి క్లిక్ చెయ్యమన్నారు.

ఆశపడ్డ వ్యాపారి ఆ లింక్‌ను క్లిక్ చెయ్యగా సైబర్ నేరగాళ్లు ఎలా లాభం వస్తుందన్న విషయమై ఇంకో మెసేజ్ పంపారు. దాంతో వ్యాపారి లోన్లు తీసుకుని, బంగారం కుదువ పెట్టి 2 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత మోసగాళ్లు అతని అకౌంట్‌లో మూడింతలు లాభం వచ్చినట్టు చూపించారు. దాంతో వ్యాపారి మరింత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత డబ్బు విత్ డ్రా చేసుకోవటానికి యత్నించగా వీలు పడలేదు. దాంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు.


Next Story

Most Viewed