ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి

by Malleboina Mahesh |

దక్షిణ ఇటలీలోని మతేరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటలీ (Italy)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి (Four Indians died) చెందారు. దక్షిణ ఇటలీలోని మతేరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదం (road accident)లో చనిపోయిన వారిలో నలుగురు భారతీయులు ఉన్నట్లు రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం (Embassy of India) అధికారికంగా ప్రకటించింది. శనివారం అగ్రి వ్యాలీలోని మతేరా నగరంలోని స్కాన్జానో జోనికో మునిసిపాలిటీలో ట్రక్కును ఢీకొన్న ఏడు సీట్ల రెనాల్ట్ సీనిక్‌లో ఉన్న ఆరుగురు వ్యక్తులతో పాటు బాధితులు ఉన్నారని ఇటాలియన్ వార్తా సంస్థ ANSA ఆదివారం నివేదించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులను కుమార్ మనోజ్ (34), సింగ్ సూర్జిత్ (33), సింగ్ హర్విందర్ (31), సింగ్ జస్కరన్ (20) గా అధికారులు గుర్తించారు. అలాగే మృత దేహాలను త్వరలోనే భారత్ పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారత రాయబార కార్యాలయం అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులు పంజాబ్ కు చెందిన వారిగా తెలుస్తుంది.

Next Story