- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫాల్కన్ గ్రూప్ మాజీ సీవోవో వికాస్ కుమార్ అరెస్ట్..
రూ. 4,215 కోట్ల ఫాల్కన్ ఫోంజీ స్కామ్‌లో కీలక నిందితుడు, మాజీ సీవోవో వికాస్ కుమార్‌ను తెలంగాణ సీఐడీ అరెస్ట్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫాల్కన్ ఫోంజీ స్కామ్‌లో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా సీఐడీ ఏడీజీపీ చారుసిన్హా తెలిపారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్ పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో A27 నిందితుడిగా ఉన్న ఫాల్కన్ గ్రూప్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) వికాస్ కుమార్‌ను బుధవారం అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు. 7,056 మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ. 4,215 కోట్లు వసూలు చేసినట్లుగా తెలిపారు. 4,065 మంది బాధితులను ఫాల్కన్ సంస్థ రూ. 792 కోట్ల మేర మోసం చేసిందని వెల్లడించారు.
సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో నమోదైన కేసును సీఐడీకి బదిలీ చేయగా దర్యాప్తు చేపట్టినట్లుగా తెలిపారు. ఫాల్కన్ సంస్థ డైరెక్టర్లపై దేశవ్యాప్తంగా 10 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఫాల్కన్ గ్రూప్ సీవోవోగా వికాస్ కుమార్ సఖారే, A2 నిందితుడిగా పేర్కొన్న సంస్థ ఎండీ అమర్‌దీప్ కుమార్, A4 నిందితుడు యోగేంద్ర సింగ్‌లతో కలిసి డిపాజిటర్లను మోసం చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. అతడిని హైదరాబాద్‌లోని హైదర్షాకోట్‌లో ఉన్న తన నివాసంలో అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ చేసినట్లుగా వెల్లడించారు. నిందితుడి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నామని, కేసు తదుపరి దర్యాప్తు జరుగుతోందని చారుసిన్హా తెలిపారు.






