- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డిలో ఐదుగురు చిన్నారుల మిస్సింగ్.. రంగంలోకి దిగిన ఏఎస్పీ
కామారెడ్డి పట్టణంలో శనివారం వేర్వేరు ఘటనల్లో ఐదుగురు చిన్నారులు మిస్సింగ్ అయ్యారు. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో శనివారం వేర్వేరు ఘటనల్లో ఐదుగురు చిన్నారులు మిస్సింగ్ అయ్యారు. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన బావ బామ్మర్దులు సింహాద్రి, విజయ్ అనే ఇద్దరు చిన్నారులు శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేరు.ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా పిల్లల ఆచూకీ లభించలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే ఆర్బీనగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సీపాత్, ఆయాత్, మరియం శనివారం ఉదయం ఆటోడ్రైవర్ అయిన తన తండ్రితో కలిసి ఆటోలో ఓ షాప్ వద్దకు వెళ్లారు. షాప్ వద్ద తినుబండారాలను కొనుక్కున్నారు. అనంతరం తామే తిరిగి ఇంటికి వెళ్తామని తండ్రితో చెప్పడంతో ఆయన ఆటోతో పాత బస్టాండ్ వైపు వెళ్ళాడు. రెండు గంటల అనంతరం తల్లి తన భర్తకు ఫోన్ చేసి పిల్లలు ఇంటికి రాలేరని తెలిపింది. దీంతో షాపు వద్ద వదిలేసి వెళ్లానని ఆయన చెప్పారు. సాయంత్రం అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్ చేరుకొని మూడు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఎవరికైనా అదృశ్యమైన పిల్లల అచూకీ తెలిస్తే వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.






