- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fire Accident: పార్క్ హయత్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతోన్న మంటలు
భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన నగరం నడిబొడ్డున ఇవాళ మధ్యా్హ్నం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. వేసవి కాలం ప్రారంభం అవ్వడంతో నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం నగరం నడిబొడ్డున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్డు నెంబర్-2 పరిధిలోని పార్క్ హయత్ (Park Hyatt) హోటల్ మొదటి అంతస్తులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. భారీగా ఎగసిపడుతోన్న మంటలతో దట్టమైన పొగలు ఆ ప్రాంతం వేగంగా వ్యాపిస్తున్నాయి. స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






