- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారాయణ స్కూల్ సెల్లార్‌లో అగ్ని ప్రమాదం.. విద్యార్థులకు తప్పిన పెనుముప్పు
నగరంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది. మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడలో ఉన్న నారాయణ స్కూల్ (Narayana School) భవనంలో ఇవాళ మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది. మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడలో ఉన్న నారాయణ స్కూల్ (Narayana School) భవనంలో ఇవాళ మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్కూల్ భవనం సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు పాఠశాల అంతటా వ్యాపించాయి. సెల్లార్ నుంచి భారీగా పొగలు రావడం గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు భవనంలోని విద్యార్థులను, ఉపాధ్యాయులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యార్థులందరూ క్షేమంగా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పిందని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది..
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ లేదా అక్కడ భద్రపరిచిన పాత సామాగ్రి వల్ల షార్ట్ సర్క్యూట్ సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఫైర్ సిబ్బంది ధృవీకరించారు.






