- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబైలో అగ్నిప్రమాదం...ఒకరి మృతి, 19 మందికి గాయాలు
by Ajay Maddhiboyina |
ముంబైలో ఓ 23 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దహిసర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా ఒకరు మరణించారు. మరో 19 మంది గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

X
దిశ, వెబ్ డెస్క్: ముంబైలో ఓ 23 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దహిసర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా ఒకరు మరణించారు. మరో 19 మంది గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఒకరు వికలాంగ బాలిక కాగా మరో నాలుగేళ్ళ బాలుడు ఉన్నాడు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. అంతే కాకుండా 36 మంది నివాసితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
23 అంతుస్తుల భవనంలోని 7వ అంతస్తులో మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు చెలరేగగా ప్రజలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఏడు ఫైర్ ఇంజన్‌లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. వెంటనే సహాయ చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో విద్యుత్ తీగల కారణంగా మంటలు చెలరేగి తీగల ద్వారానే వ్యాప్తి చెందినట్టు తేలింది.
Next Story






