Fire Accident: నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతోన్న మంటలు

by Kema Shiva Kumar |

నగరంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Fire Accident: నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతోన్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షేక్‌పేట్ (Shaikpet) పరిధిలోని జుహి ఫెర్టిలిటీ సెంటర్‌ Juhi Fertility Centre)లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే, ఘటన జరిగిన సమయంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఫెర్టిలిటీ సెంటర్‌ మొత్తం కాలి బూడిదైంది. అదేవిధంగా పక్కనే ఉన్న ఆకాశ్ స్టడీ సెంటర్‌ (Aakash Study Center)కు కూడా మంటలు వ్యాపించాయి.

అదే బిల్డింగ్‌లోనే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ (Reliance Trends) వైపు క్రమక్రమంగా మంటలు వ్యాపిస్తున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు అలముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నిస్తున్నారు. కానీ, దట్టమైన పొగ కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు తెలుత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story