రోడ్డు ప్ర‌మాదంలో తండ్రి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |

దిశ‌, శంక‌ర‌ప‌ట్నం : శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామ శివారులోని పెద్దమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. వరంగల్ పట్టణంలోని

రోడ్డు ప్ర‌మాదంలో తండ్రి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు
X

దిశ‌, శంక‌ర‌ప‌ట్నం : శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామ శివారులోని పెద్దమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. వరంగల్ పట్టణంలోని లేబర్ కాలనీకి చెందిన కొండ బత్తుల అనిల్ కుమార్ అతని కుమారుడు ప్రదీప్ వేములవాడ, కొండగట్టు పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగి వరంగల్ వెళుతుండగా హుజురాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఓ కారు వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని తాడికల్ సమీపంలో ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. మరొకరు స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఈఎంటి సతీష్ రెడ్డి క్షతగాత్రులను హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్ మృతి చెందగా.. ప్రదీప్ ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ కు తరలించినట్టు స‌మాచారం. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story