- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి
- పోలీసు వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టిన కారు
- మద్యం మత్తులో ప్రమాదం
- ముగ్గురు పోలీసులకు గాయాలు
- లంగర్ హౌజ్‌లో విషాదం
దిశ, కార్వాన్ : లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 ఏళ్ల యువతి మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇన్ స్పెక్టర్ వెంకట రాములు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక నిమజ్జనం కారణంగా లంగర్ హౌజ్ దర్గా సమీపంలో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 4:20 గంటల సమయంలో అతి వేగంగా వచ్చిన కియా కారు, రోడ్డుపై ఆగి ఉన్న పోలీసు వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ముగ్గురు అమ్మాయిలతో పాటు ఇద్దరు అబ్బాయిలు ప్రయాణిస్తుండగా, వారిలో 20 ఏళ్ల కశ్వి అనే యువతి అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి కూడా గాయాలు తగిలినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే వారిని నాలా నగర్‌లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న ఐదుగురూ మద్యం మత్తులో ఉన్నట్లు తేలిందని, కారులో నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కాగా, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ వాహనం ముందు నిలిచివున్న డీసీఎం ట్రక్‌ను కూడా ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.






