- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ ఉదయం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి నుంచి పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా బొంగ్లూరు వెళ్తున్న బలేనో కారు ఆదిభట్ల వద్దకు రాగానే అదుపుతప్పి ఎదురుగా ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో వరంగల్ జిల్లాకు మాసంపల్లి తండాకు చెందిన మలోతు చందు (29) మొయినాబాద్ మండలం ఎన్కపల్లికి చెందిన కావలి బాల్‌రాజ్ (40), మహబూబాబాద్‌కు చెందిన జనార్ధన్ (45), మరొకరు ఉన్నారు. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ టీమ్ సమాచారం మేరకు సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు స్పాట్‌కు వెళ్లి కారులోంచి మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదేవిధంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.






