Road Accident : కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by Muthe.Rajitha |

ఆదివారం మధ్యాహ్నం వికారాబాద్(Vikarabad) జిల్లా కొడంగల్(Kodangal Road Accident) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident : కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదివారం మధ్యాహ్నం వికారాబాద్(Vikarabad) జిల్లా కొడంగల్(Kodangal Road Accident) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. కొడంగల్ పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కొడంగల్ లోని ఐనన్ పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్(Hyderabad Residents) లోని కూకట్ పల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని గనుగాపూర్ లోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి కారులో వెళ్లారు. అక్కడ దర్శనం అనంతరం తిరగి వస్తుండగా.. చీట్లపల్లి-యాలమద్ది మధ్య నేషనల్ హైవేపై వీరి కారును అతివేగంగా వస్తున్న బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. డెడ్ బాడీస్ ను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story