- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు కుటుంబంలో విషాదం.. విద్యుత్ షాక్ తో రైతు మృతి..
by Batti.Sumithra |
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో ఓ రైతు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో ఓ రైతు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన రైతు విద్యాద్ఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కరీంపేట గ్రామానికి చెందిన గడ్డం ఓదేలు తన పొలానికి నీరు పెట్టడానికి వెళ్లాడని తెలిపారు.
ఎంతకీ ఇంటికి తిరగి రాకపోవడంతో ఆయన కుమారుడు జాడ వెతుకుతూ వెళ్లాడన్నారు. అతను వెళ్లేలోపే ఓదెలు వ్యవసాయ భావి వద్ద విద్యుత్ షాక్ కు గురై మృతిచెంది ఉన్నాడన్నారు. దీంతో ఇరుగుపొరుగు వారికి, పోలీసులకి సమాచారం అందించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఓదెలు మృతి చెందిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






