- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు.. యువతి తల్లిదండ్రులు ఏం చేశారంటే?
తమ కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువతి తల్లి దండ్రులు యువకుడిపై దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కాళ్లకల్ లో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: తమ కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువతి తల్లి దండ్రులు యువకుడిపై దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కాళ్లకల్ లో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కొత్తూరుకు చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా సాయినాథ్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ఈ విషయం తెలిసి పెద్దలు పెళ్లికి నిరాకరించారు. అయినప్పటికీ సాయినాథ్, యువతి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో మేడ్చల్ పోలీసులు వారిని తీసుకెళుతుండగా యువతి బంధువులు కాళ్లకల్ వద్ద అడ్డుకుని యువకుడిపై దాడి చేశారు. అనంతరం యువతిని వారితో పాటు తీసుకువెళ్లారు. దీంతో సాయినాథ్ తనకు న్యాయం చేయాలని, తన భార్యను తిరిగి ఇప్పించాలి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Next Story






