- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర విషాదం.. రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య
ఎంత కష్టమొచ్చిందో ఏమో తెలియదు కానీ.. ఓ కుటుంబం మొత్తం గూడ్స్ రైలు(Goods Train) కింద పడి బలవన్మరణానికి(Family Suicide) పాల్పడింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎంత కష్టమొచ్చిందో ఏమో తెలియదు కానీ.. ఓ కుటుంబం మొత్తం గూడ్స్ రైలు(Goods Train) కింద పడి బలవన్మరణానికి(Family Suicide) పాల్పడింది. ఈ ఘటన కడప రైల్వే స్టేషన్(Kadapa Railway Station) సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నంబర్ ట్రాక్‌పై ఓ కుటుంబం గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చుంది. రైలు ఢీకొట్టడంతో అందరూ అక్కడిక్కడే మృతిచెందారు. మృతదేహాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడ్డాయి. గమనించిన రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుల్లో భర్త(35), భార్య(30)తో పాటు ఏడాదిన్నర చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను స్థానిక రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతులు శంకరాపురానికి చెందిన శ్రీరాములు, శిరీష, రిత్విక్‌గా గుర్తించారు. భార్యాభర్తలు గొడవపడగా.. ఇద్దరిని శ్రీరాములు నానమ్మ మందలించినట్లు సమాచారం. దీంతో కోపంలో ఇంటి నుంచి రాత్రి బయటకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అనంతరం శ్రీరాములు ఇంటి నుంచి వెళ్లిపోయిన కాసేపటికే శ్రీరాములు నానమ్మ గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






