- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లాట్లు అమ్ముతానని మోసం.. ఒక్కొక్కరి వద్ద లక్షన్నర వసూల్..
by Bhanu |
ప్లాట్లు విక్రయిస్తానంటూ పలువురిని మోసం చేసిన మహ్మద్ షాకీర్ అనే వ్యక్తిని భైంసాలో పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ ,ఆదిలాబాద్: ప్లాట్లు విక్రయిస్తానంటూ పలువురిని మోసం చేసిన మహ్మద్ షాకీర్ అనే వ్యక్తిని భైంసాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను జిల్లా డీఎస్పీ జీవన్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలో షాకీర్ అనేక మందిని నమ్మబలికి, ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేశాడు. ప్లాట్లు చూపించి అమ్మకంగా నమ్మించడంతో బాధితులు అతని మాటలను నమ్మి డబ్బులు చెల్లించారు.
అయితే ప్లాట్లు రాక, డబ్బులు తిరిగి అందకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 1 టౌన్ సీఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, గురువారం నిందితుడు షాకీర్‌ను అరెస్ట్ చేశారు. ఇదివరకే అతడిపై నకిలీ పత్రాలు సృష్టించిన కేసు ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్లాట్ మోసాల కేసులో నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.
Next Story






