- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫేక్ ఎమ్మెల్యే అరెస్ట్
* ఫేక్ ఎమ్మెల్యే అరెస్ట్ * కారు, స్టిక్కర్‌తో రచ్చ రచ్చ చేసిన వ్యక్తి * పోలీసులకు సమాచారం అందించడంతో అరెస్ట్ * సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్

దిశ, వెబ్ డెస్క్ : ఫేక్ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 18 రోజులు హోటల్‌లో ఎమ్మెల్యే అని చెప్పి ఎంజాయ్ చేసిన ఫేక్ ఎమ్మెల్యే.. చివరకు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీకి చెందిన ఇద్దరు సోదరులు వినోద్ కుమార్, మనోజ్ కుమార్.. సదర్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో దిగారు. వినోద్ కుమార్ తుఘ్లకాబాద్ ఎమ్మెల్యేగా.. మనోజ్ కుమార్ తన కారు డ్రైవర్‌గా నటించారు. అక్టోబర్ 29న హోటల్‌లో చేరిన ఇద్దరు.. బిల్లు చెల్లించేందుకు ముందు నుంచే నిరాకరించారు. హోటల్ సిబ్బందిని బెదిరించి.. ఫేక్ గుర్తింపుతో ఫ్రీ సర్వీసులు పొందారు. కారుపై ఎంపీ స్టికర్, సైరన్ మెయింటెన్ చేసి.. 18 రోజులు హోటల్ యజమానిని భయపెట్టారు.
అయితే హోటల్ ఆపరేటర్‌కు అనుమానం కలిగి.. బిల్లు గురించి అడగ్గా.. మళ్లీ బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. రెండు రోజులు మరింత సమయం ఇవ్వమని, బిల్లు చెల్లిస్తామని చెప్పారు. కానీ అప్పటికీ చెల్లించకపోవడంతో అరెస్టు చేశారు. కారు సీజ్ చేశారు.






