మెహదీపట్నం డిపో ఎదుట తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో ప్రభుత్వ అధికారి మృతి

by Kema Shiva Kumar |

తోపులాటలో ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయిన ఘటన మెహదీపట్నం (Mehdipatnam) డిపో ఎదుట ఉన్న ఫంక్షన్ హాల్ వద్ద ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

మెహదీపట్నం డిపో ఎదుట తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో ప్రభుత్వ అధికారి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తోపులాటలో ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయిన ఘటన మెహదీపట్నం (Mehdipatnam) డిపో ఎదుట ఉన్న ఫంక్షన్ హాల్ వద్ద ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డిపో ఎదుట ఉన్న మెహదీపట్నం ఫంక్షన్ హాల్ యాజమాన్యం గత 8 ఏళ్ల నుంచి తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్‌ (Telangana Housing Corporation)కు పన్ను చెల్లించడం లేదు. ఇప్పటి వరకు రూ.1.50 కోట్ల బకాయి పడ్డారు. ఈ విషయంలో చాలాసార్లు ఫంక్షన్ హాల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్‌కు పన్ను ఎగ్గొట్టిన మెహదీపట్నం ఫంక్షన్ హాల్ సీజ్ చేయాలని తీర్పును వెలువరించారు. ఈ మేరకు ఇవాళ అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్.జగదీశ్వర్ రావు, సిబ్బందిలో కలిసి ఫంక్షన్ హాలును జప్తు చేసేందుకు వెళ్లగా.. వారికి, యాజమాన్యానికి మధ్య తోపులాట జరిగింది. దీంతో స్పృహ తప్పి పడిపోయిన జగదీశ్వర్ రావును తొటి సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Next Story