- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంచల్‌గూడ జైల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఖైదీల మధ్య ఘర్షణ
నిత్యం ప్రశాంతంగా ఉండే చంచల్‌గూడ (Chanchalguda) జైలు దద్దరిల్లింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నిత్యం ప్రశాంతంగా ఉండే చంచల్‌గూడ (Chanchalguda) జైలు దద్దరిల్లింది. ఇవాళ సాయంత్రం సరిగ్గా 4.30కి ఖైదీలు తమ బంధువులను కలిసే ములాఖత్ రూమ్ వద్ద ఒక్కసారిగా ఘర్షణ జరిగింది. ఓ నేరంపై మంగళవారం జైలుకు వచ్చిన ఖైదీ జాబ్రీ (Jabri)పై మరో పాత ఖైదీ దస్తగిరి (Dastagiri) పరస్పరం దాడికి దిగగా ములాఖాత్ గది సమీపంలోని అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ పెనుగులాటలో ఖైదీ జాబ్రీకి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో గమనించిన జైలు సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఖైదీలు దస్తగిరి, జాబ్రీల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో జైల్లో పరస్పరం దాడి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
Next Story






