జార్ఖండ్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ పేపర్ లీక్.. భారీ కుట్రను ఛేదించిన పోలీసులు

by Malleboina Mahesh |

జార్ఖండ్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ పేపర్ లీక్! భారీ కుట్రను ఛేదించిన పోలీసులు. గ్యాంగ్ లీడర్ అతుల్ వత్స్ కోసం ముమ్మర గాలింపు.

జార్ఖండ్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ పేపర్ లీక్.. భారీ కుట్రను ఛేదించిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామక పరీక్షా పత్రాల లీకేజీ (Leakage of exam papers) వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు ఒక భారీ కుట్రను ఛేదించడమే కాకుండా, ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై రాంచీ రూరల్ ఎస్పీ ప్రవీణ్ పుష్కర్ మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాలను లీక్ చేసేందుకు పక్కా ప్లాన్ వేశారని వెల్లడించారు. పరీక్షకు ముందే అనేక మంది అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను ఇచ్చి సమాధానాలు బట్టీ పట్టించినట్లు దర్యాప్తులో తేలిందని ఆయన పేర్కొన్నారు. తమ బృందం పక్కా సమాచారంతో నిందితుల స్థావరంపై దాడి చేసిందని, విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని ఎస్పీ స్పష్టం చేశారు.

గ్యాంగ్ లీడర్ ‘అతుల్ వత్స్’ కోసం గాలింపు..

ఈ పేపర్ లీక్ వెనుక ఉన్న ముఠా చాలా పెద్దదని, ఇందులో అనేక మంది అభ్యర్థుల ప్రమేయం కూడా ఉందని పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు అతుల్ వత్స్ నాయకత్వం వహిస్తున్నాడని, అతను ఇప్పటికే పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ తెలిపారు. పోలీసు దాడి సమయంలో కొందరు నిందితులు తప్పించుకున్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఒక కీలక అరెస్ట్ జరిగిందని, త్వరలోనే మిగిలిన వారందరినీ చట్టం ముందు నిలబెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Next Story