- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడదెబ్బకు ఉపాధి హామీ కూలి మృతి
ఎండల తీవ్రత ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ కూలి వడదెబ్బ తగిలి మరణించిన విషాద ఘటన ఇటిక్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

దిశ, ఇటిక్యాల : ఎండల తీవ్రత ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ కూలి వడదెబ్బ తగిలి మరణించిన విషాద ఘటన ఇటిక్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటిక్యాల గ్రామానికి చెందిన కొండారెడ్డి ( 85) ఎప్పటిలాగే గురువారం ఉదయం గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన ఉపాధి హామీ కూలీలు అతడిని ఇంటి వద్దకు చేర్చిన కొద్ది సేపటికి తీవ్ర అస్వస్థకు గురై మరణించినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ ఉపాధి హామీ పనుల వద్ద కనీస నీడ సౌకర్యం, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, తాగునీటి సదుపాయం కల్పించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి కూలీలు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడి కుటుంబాన్ని స్థానిక సర్పంచ్ జీవన్ రెడ్డి, డీలర్ యుగంధర్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.






