ఏసీబీ వలలో చిక్కిన విద్యుత్ లైన్ మెన్..

by Disha Web Desk 11 |
ఏసీబీ వలలో చిక్కిన విద్యుత్ లైన్ మెన్..
X

దిశ, మొయినాబాద్: విద్యుత్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న వీరకర్ణ ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం జాగీర్ గ్రామంలో హైదరాబాద్ కు చెందిన ప్రతాప్ రెండు ఎకరాల భూమిని తీసుకున్నాడు. అందులో కరెంట్ కనెక్షన్ కోసమై జూనియర్ లైన్ మెన్ వీర కర్ణను సంప్రదించగా రూ. 10,000 లంచంగా డిమాండ్ చేయడంతో రూ. 10,000 ఇచ్చానని ప్రతాప్ తెలిపాడు.

తదనంతరం మీటర్ వచ్చాక మీటర్ బిగించడానికి మరో రూ. 5000 ఇవ్వాలని వీరకర్ణ డిమాండ్ చేయడంతో విసిగిపోయిన రైతు ప్రతాప్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు చాకచక్యంగా బాకారం జాగీర్ శివారులో రైతు నుంచి లైన్ మెన్ వీర కర్ణ రూ. 5000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిని గురువారం ఏసీబీ కోర్టులో హాజరు పరచడం జరుగుతుంది.

Next Story