- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలలో వృద్ధుడి మృతదేహం కలకలం..!
by Bhanu |
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

X
దిశ, భైంసా: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం ప్రకారం, మృతుడు గంగసముద్రవార్ ఎల్లప్ప (75).. సౌండ్లి గ్రామానికి చెందినవాడు. జీవనోపాధి కోసం గత కొంతకాలంగా బాసర మండల కేంద్రంలో నివసిస్తూ చెప్పుల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే ఈ ఉదయం ఆయన మృతదేహం నాలలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది సహాయంతో నాలపై వేసిన స్లాబ్‌ను పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పూర్తి వివరాలు విచారణలో తేలనున్నాయని పోలీసులు తెలిపారు.
Next Story






