కార్ల స్మగ్లింగ్ కేసులో ఈడీ దూకుడు.. కేటీఆర్‌ మెడకు చుట్టుకోనున్న వ్యవహారం!

by Gantepaka Srikanth |

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి దూకుడు పెంచారు.

కార్ల స్మగ్లింగ్ కేసులో ఈడీ దూకుడు.. కేటీఆర్‌ మెడకు చుట్టుకోనున్న వ్యవహారం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి దూకుడు పెంచారు. శుక్రవారం హైదరాబాద్‌లోని లగ్జరీ కార్ డీలర్ బసరత్ ఖాన్(Basarat Khan) ఇంట్లో, కార్యాలయంలో సోదాలు చేశారు. బసరత్ ఖాన్ ఎవరెవరికి కార్లు అమ్మారనే దానిపై ఆరా తీశారు. ఫెమా ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్‌పై ఇప్పటికే ఈడీ కేసు నమోదైంది.

హైదరాబాదులో లగ్జరీ ఇంపార్టెంట్ కార్ల విక్రయాల బసరత్ ఖాన్ డీలర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు లగ్జరీకారులను అమ్మారు. బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేసిన కారును మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌లో ఉండటంపై అనుమానాలు మొదలయ్యాయి. కార్ పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా?.. అంటూ రెండ్రోజుల క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఖాన్ కుటుంబ కంపెనీ పేరుతో కేటీఆర్ వాహనం తీసుకోవడాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు. సంబంధిత దర్యాప్తు సంస్థలు వాస్తవాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఆ కార్‌ను కేటీఆర్ సాధారణ వాహన కొనుగోలు ప్రక్రియలోనే తీసుకున్నారంటూ అదేరోజు బీఆర్ఎస్ నేతలు వివరణ కూడా ఇచ్చారు.

బసరత్ ఖాన్ నుండి రాష్ట్ర మంత్రి కూడా కార్ కొనుగోలు చేశారనే విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. బండి సంజయ్ ట్వీట్ నేపథ్యంలో నేడు ఈడీ సోదాలు అధికారలు సోదాలు జరిపారు. జూబ్లీహిల్స్‌లోని బసరత్ ఖాన్ నివాసం, గచ్చిబౌలిలోని ఎస్కే కార్ లాంజ్ వద్ద సోదాలు చేశారు. అంతేకాదు.. బసరత్ ఖాన్ స్నేహితుల ఇళ్లల్లోనూ ఈడీ ముమ్మర సోదాలు చేశారు. మాజీమంత్రి కేటీఆర్‌ మెడకు బసరత్ ఖాన్ వ్యవహారం చుట్టుకోనుందని తెలుస్తోంది. అమెరికా, జపాన్ నుండి తెచ్చిన కార్లను దుబాయ్, శ్రీలంక మీదుగా తరలించినట్లు వెల్లడించారు. బసరత్ ఖాన్‌తో పాటు దీనివెనుక ఉన్న సూత్రధారులు, కొనుగోలుదారుల వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Next Story