ఐ-బొమ్మ కేసులోకి ఈడీ ఎంట్రీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-18 11:51:11  IST  )

ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ

ఐ-బొమ్మ కేసులోకి ఈడీ ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐ-బొమ్మ(I-Bomma) నిర్వాహకుడు రవి అరెస్ట్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) ఎంటర్ అయింది. ఇమ్మడి రవి లావాదేవీలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ఈడీ మంగళవారం లేఖ రాసింది. రవి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. కాగా, గత కొన్నేళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు ఐ-బొమ్మను వేదికగా మార్చిన ఇమ్మడి రవి (40)ని రెండ్రోజుల క్రితం హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్ట్‌ చేశారు. ఇతడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్‌ డిస్క్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. ప్రస్తుతం రవి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. మరోవైపు ఐ-బొమ్మ, దాని అనుబంధంగా ఉన్న 65 వెబ్‌సైట్లను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బ్లాక్‌ చేశారు.

Next Story