- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈగల్ టీమ్ దూకుడు.. 935 కిలోల గంజాయి పట్టివేత
తెలంగాణ (Telangana)లో గంజాయి, డ్రగ్స్ (Drugs), ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో గంజాయి, డ్రగ్స్ (Drugs), ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఈగల్ టీమ్’ ఏర్పాటు చేసింది. డ్రగ్స్ విక్రయిస్తూ.. ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department) సిబ్బందికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఈగల్ టీమ్, టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది టచ్‌లో ఉంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని జాతీయ రహదారులపై వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒడిశా నుంచి మహారాష్ట్రకు పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్నారని ఖమ్మం ఈగల్ టీమ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. అయితే, హైదారబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద స్మగ్లర్ల ఆచూకీ లభించగా.. ఖమ్మం ఈగల్ టీమ్, రాచకొండ పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 935 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పట్టబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.5 లక్షల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.






