Drugs Seize: సంగారెడ్డిలో పోలీసుల తనిఖీలు.. భారీగా కొకైన్ స్వాధీనం

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం ఉక్కపాదం మోపుతోంది.

Drugs Seize: సంగారెడ్డిలో పోలీసుల తనిఖీలు.. భారీగా కొకైన్ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం ఉక్కపాదం మోపుతోంది. తెలంగాణను డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌ (Drugs Free State)గా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే కఠినంగా అమలు చేస్తోంది. ఈ మేరకు డ్రగ్స్ విక్రయిస్తూ.. ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో టాస్క్‌ఫోర్స్ (Taskforce) టీమ్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. జహీరాబాద్ (Zaheerabad) సమీపంలో వాహనాల తనిఖీ చేపడుతుండగా.. ఓ ప్రైవేటు బస్సు (Private Bus)లో రూ.10 లక్షల విలువైన కొకైన్‌ (Cocaine)ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పట్టుబడిన డ్రగ్ గోవా (Goa) నుంచి హైదాబాద్‌ (Hyderabad)కు తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story