Drugs Seize: ఇండియన్ నేవీ ఆపరేషన్.. అరేబియా సముద్రంలో 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం

by Kema Shiva Kumar |   (  Updated:2024-11-29 04:36:41  IST  )

దేశ వ్యాప్తంగా డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Drugs Seize: ఇండియన్ నేవీ ఆపరేషన్.. అరేబియా సముద్రంలో 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వదేశంలో తయారు అవుతోన్న, విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవు (Ports)లను కస్టమ్స్ అధికారులు (Customs officials), నార్కొటిక్ బ్యూరో (Narcotics Bureau) అధికారులు నిత్యం జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్‌గా చెక్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అరేబియా సముద్రం (Arabian Sea)లో డ్రగ్స్ (Drugs) తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఇండియన్ నేవీ (Indian Navy) అప్రమత్తమైంది. ఈ మేరకు శ్రీలంక నేవీ (Srilanka Navy)తో కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా కొందరు ఫిషింగ్ బోట్‌ (Fishing Boat)లో డగ్స్ తరలిస్తుండగా.. వారిని చాకచక్యంగా ఇండియన్ నేవీ అదుపులోకి తీసుకుని వారి నుంచి 500 కిలోల డగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story