శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో DRI అధికారుల తనిఖీలు.. రూ.3.45 కోట్ల విలువైన బంగారం సీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-01 09:30:42  IST  )

ప్రపంచ మార్కెట్‌లో బంగారం (Gold) ధరలు ఆకాశాన్నంటుతోన్న వేళ గోల్డ్ స్మగ్లింగ్‌పై ఇటీవలే కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో DRI అధికారుల తనిఖీలు.. రూ.3.45 కోట్ల విలువైన బంగారం సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ మార్కెట్‌లో బంగారం (Gold) ధరలు ఆకాశాన్నంటుతోన్న వేళ గోల్డ్ స్మగ్లింగ్‌పై ఇటీవలే కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సెంట్రల్ ఇంటెలిజెన్స్ (Central Intelligence), కస్టమ్స్ (Customs), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారుల‌కు సూచించింది. ఈ క్రమంలోనే ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవు (Ports)ల్లో కస్టమ్స్ అధికారులు (Customs officials) అధికారులు నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్‌గా చెక్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం నుంచి శంషాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) టీమ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ మేరకు మస్కట్ (Mascot) నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ సిబ్బందిపై అనుమానం వచ్చి చేయగా వారి వద్ద లోదుస్తుల్లో దాచిన 3.50 కిలలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3.45 కోట్లు విలువ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఆర్ఐ టీమ్ వెల్లడించింది.

Next Story