రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. నైజీరియా మహిళతో పాటు మరో వ్యక్తి అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-20 03:18:41  IST  )

దేశ వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి సంస్కృతి పెరుగుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. నైజీరియా మహిళతో పాటు మరో వ్యక్తి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి సంస్కృతి పెరుగుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వదేశంలో తయారవుతోన్న, విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బస్టాండ్లు, ఎయిర్‌పోర్టులు, ఓడరేవులలో కస్టమ్స్ అధికారులు (Customs officials), నార్కొటిక్ బ్యూరో (Narcotics Bureau), యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ నిత్యం జల్లెడ పడుతోంది. అదేవిధంగా దేశం చుట్టూ వ్యాపించి ఉన్న సముద్ర జాలాల్లో డ్రగ్స్ అక్రమ రవాణాపై కోస్ట్ గార్డ్స్ నిత్యం పహారా కాస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ (Delhi) నుంచి ముంబై (Mumbai)కి డ్రగ్స్ తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందం విస్తృతంగా తనిఖీల చేపట్టింది. ఈ సోదాల్లో ఓ బస్సులో నైజీరియా (Nigeria)కు చెందిన మహిళ నార్కోటిక్ పదార్థాలను రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. అనంతరం ఆమె వద్ద ఉన్న లగేజ్ చెక్ చేయగా.. ఓట్స్ ప్యాకెట్లు, జ్యూస్ టెట్రా ప్యాకెట్లలలో ఎవరికి అనుమానం రాకుండా దాచిన నిషేధిత గ్రడ్ క్రిస్టలైన్ టాబ్లెట్లు లభ్యమయ్యాయి. ఎన్‌డీపీఎస్ ఫీల్డ్ టెస్ట్ కిట్‌ (NDPS Field Test Kit)తో లాబొరేటరీ పరీక్షలు నిర్వహించగా.. 2.56 కిలో గ్రాముల మెథాంఫెటమైన్, 584 గ్రాముల ఎక్స్టసీ టాబ్లెట్లుగా డీఆర్ఐ అధికారులు నిర్ధారించారు. అదేవిధంగా ఆ సరుకును స్వీకరించబోయే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ బహిరంగ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.5 కోట్లుకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నైజీరియన్ జాతీయురాలిని అదుపులోకి తీసుకుని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్-1985 కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story