శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో DRI అధికారుల తనిఖీలు.. భారీగా బంగారం సీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-16 12:44:25  IST  )

దేశ వ్యాప్తంగా బంగారం (Gold) ధరలు ఆకాశాన్నంటుతోన్న వేళ గోల్డ్ అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో DRI అధికారుల తనిఖీలు.. భారీగా బంగారం సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా బంగారం (Gold) ధరలు ఆకాశాన్నంటుతోన్న వేళ గోల్డ్ అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా విదేశాల నుంచి దొంగచాటుగా బంగారం తీసుకొస్తే స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సెంట్రల్ ఇంటెలిజెన్స్ (Central Intelligence), కస్టమ్స్ అధికారుల (Customs Officials)కు సూచించింది. ఈ క్రమంలోనే ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవు (Ports)ల్లో కస్టమ్స్ అధికారులు (Customs officials) అధికారులు నిత్యం జల్లెడ పడుతున్నారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్‌గా చెక్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి భారీ ఎత్తున అక్రమంగా బంగారం తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు ఇవాళ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు కువైట్‌ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతడి వద్ద ఏకంగా 7 బంగారు కడ్డీలు అభ్యమయ్యాయి. 1.8 కిలోల బరువున్న బంగారు కడ్డీల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2.37 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి పూర్తి సమాచారం రాబడుతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story