గంగాధరిపల్లిలో కుక్కల దాడి.. 15 గొర్రె పిల్లల మృతి

by Ratna Kumari |   (  Updated:2025-11-17 15:12:16  IST  )

దిశ, జడ్చర్ల / బాలానగర్ : కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలకు మృత్యువాత పడిన ఘటన బాలనగర్ మండలం గంగాధర్ పల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు

గంగాధరిపల్లిలో కుక్కల దాడి.. 15 గొర్రె పిల్లల మృతి
X

దిశ, జడ్చర్ల / బాలానగర్ : కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలకు మృత్యువాత పడిన ఘటన బాలనగర్ మండలం గంగాధర్ పల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు రాములు (5), చెనయ్య (3), నరేష్ (2), మలయ్య (2), జంగయ్య (2), నర్సింహ‌ (1) గొర్రె పిల్లలను తమ దొడ్ల వద్ద జాలిలో మూసి ఉంచగా వాటిపై కుక్కలు మూకుమ్మ‌డిగా దాడి చేసి గొర్రె పిల్లలను చంపేశాయి. తమ జీవనాధారమైన గొర్రె పిల్లలను కుక్కల దాడిలో మృతి చెందడం పట్ల తీవ్ర ఆవేదన చెందారు. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి వెంటనే స్పందించి, బాధిత కుటుంబాలకు స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా తక్షణ ఆర్థిక సాయంగా మొత్తం రూ.20,000 అందజేశారు. రైతుల‌కుఅందించిన సాయం ప‌ట్ల ఎమ్మెల్యేకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Next Story