- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజిటల్ అరెస్ట్..3 నెలల్లో 19 కోట్లు పోగొట్టుకున్న డాక్టర్
డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ డాక్టర్ భర్త నుండి సైబర్ నేరగాళ్లు ఏకంగా 19 కోట్లు దోచేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ డాక్టర్ భర్త నుండి సైబర్ నేరగాళ్లు ఏకంగా 19 కోట్లు దోచేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగింది. గాంధీనగర్‌కు చెందిన ఓ వైద్యురాలి భర్తకు పోలీసులు, లాయర్ పేరుతో కేటుగాళ్లు ఫోన్ చేశారు. అక్రమాస్తుల కేసులో మీపై మనీలాండరింగ్ కేసు పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. అది నమ్మిన డాక్టర్ భర్త, డాక్టర్ కలిసి నిందితుల ఖాతాకు విడతల వారీగా తాము దాచుకున్న డబ్బంతా బదీలీ చేశారు. తరచూ బెదిరింపులకు పాల్పడటంతో తమ బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు.
అయినా వేధింపులు ఆగకపోవడంతో బాధితులు జరిగిన విషయం చెబుతూ బంధువుల వద్ద వాపోయారు. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును చేదించేందుకు జూలై 16న గుజారాత్ సీఐడీ అధికారులు, సైబర్ క్రైం అధికారులు రంగంలోకి దిగారు. సూరత్‌లో ఒక నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడి ఖాతాలో రూ. కోటి ఉన్నట్టు గుర్తించారు. కేసులో నిందితులుగా ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. దేశంలో జరిగిన అతిపెద్ద సైబర్ నేరాలలో ఇది ఒకటని అధికారులు భావిస్తున్నారు.






